మహేశ్ బాబు తాను ఎంచుకునే కథల విషయంలో .. తన ప్రాజెక్టుల విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉంటాడు. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ సినిమాకి ‘పార్థు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కథ ఏమిటి? మహేశ్ బాబు పాత్ర ఎలా ఉంటుంది? అనే విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తాడట. తన తండ్రి ఒక ‘డాన్’ అని తెలుసుకున్న అతను, కొన్ని పరిస్థితుల్లో తండ్రితోనే తలపడతాడట. అంటే ఇది తండ్రీకొడుకుల మధ్య జరిగే వార్. డాన్ పాత్రలో అనిల్ కపూర్ ను అనుకుంటున్నారట. మహేశ్ బాబు సరసన నాయికలుగా కైరా అద్వానీ .. పూజా హెగ్డే అలరించనున్నారు.