14/05/2021

అందుకే రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి: గోరంట్ల

  • కరోనాను నియంత్రించడంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది
  • ప్ర‌క‌ట‌న‌ల‌కు ఖ‌ర్చు చేస్తున్నారు
  • వ్యాక్సిన్ల‌కు చేయ‌లేరా?

క‌రోనా విజృంభ‌ణ పెరిగిపోయిన స‌మ‌యంలో దాన్ని నియంత్రించడంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైనందుకే రాష్ట్రంలో అధికంగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు. ప్ర‌క‌ట‌న‌ల‌కు ఖ‌ర్చు చేస్తున్నార‌ని, వ్యాక్సిన్ల‌కు చేయ‌లేరా? అని ఆయ‌న మండిప‌డ్డారు.

మ‌రోవైపు, ప్ర‌ధాని మోదీ  మ‌త‌, రాజ‌కీయ ప్ర‌చారాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం వ‌ల్లే దేశంలో వైర‌స్‌ను అదుపు చేయ‌లేని దుస్థితి ఏర్ప‌డింద‌ని  చెప్పారు. క‌రోనాతో దేశ వ్యాప్తంగా ల‌క్ష‌ల మంది చ‌నిపోయార‌ని, క‌రోనా ప‌రిస్థితుల స‌మయంలో మోదీ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పారు. క‌నీసం ఆక్సిజ‌న్‌ను కూడా స‌ర‌ఫ‌రా చేయ‌లేని స్థితిలో ప్ర‌భుత్వం ఉంద‌ని తెలిపారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: