ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఫల్టాన్ మున్సిపల్ పరిధిలోని ఓ శ్మశానవాటికలో జరిగింది. ఆ దృశ్యాల‌ను కొంద‌రు స్మార్ట్‌ఫోన్ల‌లో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కరోనా మృతదేహాలకు అంత్య‌క్రియ‌లు చేసి సిబ్బంది శ్మ‌శాన వాటిక నుంచి వెళ్లిపోయాక‌ సగం కాలిన కరోనా మృతదేహాల అవయవాలను ఓ వ్యక్తి పీక్కు తింటున్నారు. అత‌డి చేష్ట‌ల‌ను చూసిన‌ స్థానికులు పోలీసుల‌కు సమాచారం అందించారు. దీంతో ఫల్టాన్ మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకున్నారు.

వారు శ్మ‌శానినికి వచ్చేలోగా సదరు వ్యక్తి అక్క‌డి నుంచి పారిపోయాడు. అత‌డికి కొన్ని గంట‌ల్లోనే అధికారులు గాలించి పట్టుకున్నారు. అత‌డికి మతిస్థిమితం సరిగా లేదని తెలుసుకున్నారు. అత‌డిని చికిత్స కోసం ఆసుప‌త్రికి తరలించామ‌ని,  వైద్య నివేదికలు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.