14/05/2021

గాంధీ ఆసుపత్రిలో అన్నీ బంద్.. పూర్తి స్థాయి కరోనా ఆసుపత్రిగా మార్పు!

తెలంగాణలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దీంతో ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి ఓపీ సేవలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం కరోనా పేషెంట్లకు మాత్రమే సేవలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇప్పటికే గాంధీలో 450 మందికి పైగా కరోనా పేషెంట్లు ఉన్నారు. నిన్న ఒక్క రోజే 150 మంది అడ్మిట్ అయ్యారు. ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్ బ్లాక్ మొత్తం కరోనా పేషెంట్లతో నిండిపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ సందర్భంలో కూడా గాంధీని పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. అయితే, ఆ తర్వాత కేసులు తగ్గడంతో ఇతర పేషెంట్లను కూడా అనుమతించారు. ఇప్పుడు సెకండ్ వేవ్ సందర్భంగా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో… గాంధీని మరోసారి పూర్తి స్థాయి కోవిడ్ ఆసుత్రిగా మార్చారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: