14/05/2021

పశ్చిమ గోదావరిలో గ్యాస్ లీక్‌.. భ‌యాందోళ‌న‌ల్లో స్థానికులు

పైప్‌ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం మండలం సీతారామపురం వద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్ లీక్ కావ‌డంతో అందులోంచి మంటలు వ‌స్తున్నాయి. గ్యాస్ లీకేజీపై స‌మాచారం అందుకున్న ఓఎన్‌జీసీ, అగ్నిమాపక సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్ర‌మాదాన్ని అరికట్టేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

 

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: