ఏపీలో కరోనా వైరస్ జూలు విదుల్చుతోంది. గత 24 గంటల్లో 31,268 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,558 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 465 కొత్త కేసులు వెలుగు చూశాయి. గత కొన్నిరోజులుగా చిత్తూరు జిల్లాలో రోజువారీ కేసుల సంఖ్య మూడంకెల్లో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇతర జిల్లాల్లోనూ కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. గుంటూరు జిల్లాలో 399, కర్నూలు జిల్లాలో 344, విశాఖ జిల్లాలో 290, నెల్లూరు జిల్లాలో 204 పాజిటివ్ కేసులు గుర్తించారు.
అదే సమయంలో 915 మంది కోలుకోగా, ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,15,832 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,93,651 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14,913కి పెరిగింది. ఏపీలో ఇప్పటిదాకా కరోనాతో మరణించినవారి సంఖ్య 7,268కి చేరింది.
More Stories
బోగస్ ఓట్లకు నిరసనగా తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద బీజేపీ-జనసేన శ్రేణులు
బయటి ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు తిరిగొచ్చి ఓటు వేస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారు: వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి
తిరుపతిలోకి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు: చంద్రబాబు ఆరోపణ