తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,055 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం. ఒక్కరోజులో కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 303 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,704కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,03,601 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,741గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 13,362 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,263 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 398 మందికి కరోనా సోకింది.
More Stories
కరోనా ఉద్ధృతితో జేఈఈ మెయిన్-2021 పరీక్ష వాయిదా
ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది.. కరోనా భారీగా విస్తరించే అవకాశం ఉంది: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
హైదరాబాద్ లోనూ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్.. వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ!