22/04/2021

ఆస‌క్తికరంగా అఖిల్ కొత్త సినిమా లుక్‌, టైటిల్‌.. పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల‌

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఈ రోజు పుట్టిన రోజు వేడుక‌ను జ‌రుపుకుంటోన్న నేప‌థ్యంలో ఆయ‌న కొత్త‌ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌లయ్యాయి. ఈ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అఖిల్ ను ఎన్న‌డూ చూడ‌ని కొత్త లుక్‌లో ఆయ‌న చూపించారు.

గ‌డ్డం, జుట్టు, మీసాలు పెంచేసి చేతిలో సిగ‌రెట్ ప‌ట్టుకుని, నోటి నుంచి పొగ‌వ‌దులుతూ అఖిల్ క‌న‌ప‌డుతున్నాడు. ఈ సినిమాకు ‘ఏజెంట్’ టైటిల్ ను ఖ‌రారు చేశారు. అఖిల్ లుక్ చాలా ఆస‌క్తికరంగా ఉంది. ఈ సినిమా క‌థ కూడా చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

హీరో అఖిల్ కు మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ట్విట్ట‌ర్ లో శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ‘స‌క్సెస్ కి హార్డ్ వ‌ర్క్‌ ని మించిన ఫార్ములా లేదు. నువ్వు ఆ హార్డ్ వ‌ర్క్‌ నే నమ్ముకున్నావని నేను నమ్ముతున్నాను. నీ క‌ల‌లు నిజం కావాల‌ని, ఎన్నో విజ‌యాల‌ను అందుకోవాల‌ని కోరుకుంటున్నాను.. పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు’ అని చిరంజీవి పేర్కొన్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: