08/05/2021

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విరుచుకుపడనున్న ‘ఉప్పెన’

ఈ మధ్య కాలంలో తెలుగు తెరను పలకరించిన అందమైన ప్రేమకథా చిత్రాలలో ‘ఉప్పెన’ ముందువరుసలో నిలిచింది.సముద్ర తీరప్రాంతంలోని ఓ జాలరి గూడెం చుట్టూ తిరిగే ప్రేమకథ ఇది. సముద్రంపైనే ఆధిపత్యం చెలాయించాలనుకునే ఓ నాయకుడి కూతురు .. ఓ జాలరి కుర్రాడి ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమను అంగీకరించని ఆ పిల్ల తండ్రి ఏం చేశాడు? పర్యవసానాలు ఎలాంటి? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. ప్రేమకథలకు పసందైన పాటలే పెద్ద దిక్కు. కొత్త అవకాయ పచ్చడిలాంటి ఈ కథలో పాటలు పాయసంలా తగులుతాయి. సాధారణంగా ‘ఉప్పెన’ వస్తే ఆస్తులు కొట్టుకుపోతాయి. కానీ ఈ ‘ఉప్పెన’కి కోట్ల రూపాయలు కొట్టుకురావడం విశేషం.

బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి నాయకా నాయికలుగా నటించారు. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేసింది. థియేటర్లను దడదడలాడించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి ముస్తాబవుతోంది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. మే 14వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఇక ఓటీటీలో ఈ సినిమా రేంజ్ లో దూసుకుపోతుందో చూడాలి.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: