22/04/2021

అఖిల్ మూవీపై అంచనాలు పెంచేసే సాంగ్ వచ్చేస్తోంది!

అఖిల్ అభిమానులంతా కూడా ఆయన సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ తాజా చిత్రంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అఖిల్ జోడీగా పూజా హెగ్డే అలరించనుంది. ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుని చాలాకాలమే అయింది. క్రితం ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎలాంటి పోటీ లేకుండా చూసుకుని ఈ సినిమాను సోలోగా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రకారమే జూన్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్లకు .. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ మరింత హ్యాండ్సమ్ గా ఉన్నాడనీ, పూజా హెగ్డే మరింత గ్లామరస్ గా ఉందనే టాక్ వచ్చింది. ఈ నెల 5వ తేదీన ఈ సినిమా నుంచి ‘ఏ జిందగీ ..’ అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. గోపీసుందర్ స్వరపరిచిన ఈ పాట ఈ సినిమాపై అంచనాలు పెంచుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో మెరవనుండగా, ఆమని ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది.  పూజా హెగ్డే గోల్డెన్ లెగ్ ఈ సినిమాకి కలిసొస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఇటు అఖిల్ కి .. అటు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కి కూడా ఈ సినిమా సక్సెస్ కీలకం కానుంది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: