17/04/2021

నాగ్ నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూవీ ఖాయమైనట్టే!

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన వైష్ణవ్ తేజ్, ‘ఉప్పెన’ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. వైష్ణవ్ తేజ్ కి ఇది తొలి సినిమా అయినప్పటికీ, ఎక్కడా కూడా ఆయన తడబడినట్టుగా కనిపించలేదని ప్రేక్షకులు  చెప్పుకున్నారు. చాలా అనుభవం కలిగిన నటుడిగా సహజంగా చేశాడనే టాక్ వచ్చింది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో ఏ డెబ్యూ హీరో వసూలు చేయని మొత్తం రాబట్టి, కొత్త రికార్డులను తన వాకిట్లో కట్టేశాడు. దాంతో వైష్ణవ్ తేజ్ తో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద బ్యానర్లు ఉత్సాహాన్ని చూపించాయి. ఆ బ్యానర్లలో అన్నపూర్ణ బ్యానర్ కూడా ఉందనే  ప్రచారం జరిగింది.

నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో వైష్ణవ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడనే వార్తలో, ఎంతవరకూ నిజం ఉందనేది సందేహంగా మారింది. అలాంటి సందేహాలకు నాగార్జున తెరదించేశారు. నాగార్జున హీరోగా ‘వైల్డ్ డాగ్’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమా రేపు భారీస్థాయిలో విడుదలవుతోంది. దాంతో నాగార్జున ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. అదే సమయంలో వైష్ణవ్ తేజ్ తో సినిమాను గురించి ప్రశ్నించగా, అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని నాగార్జున చెప్పారు. వైష్ణవ్ తేజ్ కు కథ చాలా బాగా నచ్చిందనీ, ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడని అన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబధించిన ప్రకటన చేస్తాం” అని చెప్పుకొచ్చారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: