07/05/2021

ఎండాకాలంపై ‘ఆర్​ఆర్​ఆర్’​ మూవీ ఆసక్తికరమైన ట్వీట్​.. సెటైర్లు వేస్తున్న అభిమానులు​!

అబ్బబ్బ.. ఏప్రిల్ ఇప్పుడేనా మొదలైంది.. సూరీడు అప్పుడే సుర్రుమనడం మొదలుపెట్టేశాడు. బయట అడుగు పెట్టాలంటేనే భయపడాల్సి వస్తోంది. అవును మరి, అంతలా ఉన్నాయి ఎండలు. కొన్ని చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా.. కొబ్బరి బొండాలు గుటుక్కుమనిపించినా.. జ్యూస్ లు, కూల్ డ్రింక్ లు తాగినా దాహం తీరని పరిస్థితి. బయటికెళ్తే జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచనలు ఇస్తున్నారు.

అయితే, అవే సూచనలనూ ఆర్ఆర్ఆర్ చిత్రబృందమూ ఇచ్చింది. కాకపోతే సినిమా స్టైల్ లో కొంచెం కొత్తగా చెప్పింది. సినిమాను నీరు, నిప్పు అన్న రెండు కోణాల్లో డైరెక్టర్ రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ను అల్లూరిగా పరిచయం చేసిన ఆయన.. నిప్పుగా చూపించాడు. తారక్ ను కుమ్రం భీంగా ప్రెజెంట్ చేసి.. నీరుగా అందరికీ పరిచయం చేశాడు.

ఇప్పుడు అదే యాంగిల్ లో వేసవి కాలానికీ ముడిపెట్టింది ఆర్ఆర్ఆర్ టీం. ‘వడగాడ్పుల అలర్ట్’ అంటూ.. వేసవి సూచనలు ఇచ్చింది. ‘‘సూర్యుడు మంట మీదున్నాడు.. జాగ్రత్త ఉండండి. నీరు ఎక్కువగా తాగండి.. ఎప్పుడూ చల్లగా ఉండండి’’ అంటూ సినిమా పోస్టర్ ను పోస్ట్ చేసింది. దీనిపై ఫ్యాన్స్ నుంచి సెటైర్లు ఎక్కువగా పేలాయి. సినిమాను ఆలస్యంగా విడుదల చేస్తారన్న అపవాదును రాజమౌళి మోస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఈ పోస్టర్ ను విడుదల చేయడంతో.. ‘వీటికి మాత్రం తక్కువేం లేదు’ అంటూ అభిమానులు సెటైర్లు వదులుతున్నారు. ‘హ్యాపీ ఫూల్స్ డే బ్రో’ అంటూ రిప్లైలు ఇస్తున్నారు. అప్ డేట్స్ ఏమైనా ఉన్నాయా.. ఇవేనా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎండాకాలం షూటింగ్ ఆపాలని, పోస్ట్ పోన్ చేయాలని ఏమైనా ఆలోచిస్తున్నారా ఏంటి? అంటూ సెటైర్లు, జోకులు పేలుస్తున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: