07/05/2021

ఇన్ స్టాలో దూసుకుపోతున్న సమంత

*  అందాలతార సమంత సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ కొత్త విషయాలు పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో దూసుకుపోతోంది. ఇటీవలే ఆమె 15 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. వారం తిరక్కముందే ఆ సంఖ్య 16 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా అభిమానులకు సమంత థ్యాంక్స్ చెబుతూ, ఆనందాన్ని వ్యక్తం చేసింది.
*  ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నటిస్తున్న హీరో నాని.. దీని తర్వాత ‘అంటే సుందరానికి..’ అనే చిత్రంలో నటించనున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ మే నెల నుంచి జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో నజ్రియా ఫహద్ కథానాయికగా నటిస్తుంది.
*  రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖిలాడి’ చిత్రం షూటింగుకు కరోనా ఎఫెక్ట్ పడింది. ఇటీవల ఈ చిత్రం యూనిట్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది. అయితే, అక్కడ మళ్లీ కరోనా ఎక్కువవడంతో పది రోజుల షూటింగు అనంతరం ప్యాకప్ చెప్పేసి, యూనిట్ హైదరాబాదుకి తిరిగొచ్చేసింది. తదుపరి షూటింగును ఈ నెలలో హైదరాబాదులో ప్రారంభిస్తారని సమాచారం.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: