దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈరోజు చివరి రోజు కావడంతో… బ్యాంకుల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. దీనికి తోడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గచూపడం కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. మరోవైపు భారత్ లో ద్రవ్యోల్బణం ఆందోళనకర రీతిలో ఉందని మూడీస్ అనలిటిక్స్ పేర్కొంది. దీంతో, మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 627 పాయింట్లు నష్టపోయి 49,509కి పడిపోయింది. నిఫ్టీ 154 పాయింట్లు పతనపై 14,690 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (1.82%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.36%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.90%), టీసీఎస్ (0.56%).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-4.06%), హెచ్బీఎఫ్సీ బ్యాంక్ (-3.86%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.71%), టెక్ మహీంద్రా (-2.50%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.71%).
More Stories
స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు, 12వ తరగతి పరీక్షలు వాయిదా
మరో మారు దేశవ్యాప్త లాక్ డౌన్ పై నిర్మల సీతారామన్ తాజా వ్యాఖ్యలు!