17/04/2021

అచ్చం మా స్కూల్లో విధించే శిక్షలాగే ఉందే!: ఆనంద్ మహీంద్రా

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండడంతో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు లేనివారీతో గుంజీలు తీయించడం, కప్పగంతులు వేయించడం, డక్ వాకింగ్ వంటి శిక్షలు విధిస్తున్నారు. ఇటీవల ముంబయి మెరైన్ డ్రైవ్ లో మాస్కులు లేని కొందరిని దొరకబుచ్చుకున్న పోలీసులు వారితో డక్ వాకింగ్ చేయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు.

ఈ శిక్షలు చూస్తుంటే తాను చిన్నప్పుడు చదివిన గురుకుల పాఠశాలలో విధించే శిక్షల్లా ఉన్నాయని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చూసేవాళ్లకు నవ్వు తెప్పించినా, డక్ వాకింగ్ చేసేవాళ్ల బాధ అంతాఇంతా కాదని పేర్కొన్నారు. తాజాగా ముంబయి పోలీసులు విధించిన శిక్షను చూసిన తర్వాత ఇక మాస్కు ఎట్టిపరిస్థితుల్లోనూ మర్చిపోను అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ముంబయి పోలీసుల వీడియోను తన ట్వీట్ లో పంచుకున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: