తెలంగాణలో లేకపోతే నాపై రాజద్రోహం కేసు పెట్టేవారేమో: ప్రొఫెసర్ నాగేశ్వర్

Spread the love
  • మోదీ విధానాలను ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు
  • జీవితాంతం జైల్లో మగ్గేలా చేస్తున్నారు
  • కార్పొరేట్లను దూరం పెడితే లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ. 30 చొప్పున తగ్గించొచ్చు
I am safe because I am in Telangana says Prof Nageswar
ప్రధాని మోదీ పాలనా విధానాలపై ఎవరు ప్రశ్నించినా వారిపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. వారిని జీవితాంతం జైల్లో మగ్గేలా చేస్తున్నారని విమర్శించారు. తాను తెలంగాణలో ఉండటం వల్ల ప్రశాంతంగా ఉన్నానని… లేకపోతే తనపై కూడా కేసులు పెట్టేవాళ్లేమోనని అన్నారు.

మన దేశంలో ఇప్పటికీ 4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రొఫెసర్ చెప్పారు. 22 కోట్ల మంది రోజుకు రూ. 375 కంటే తక్కువ సంపాదనతోనే బతుకీడుస్తున్నారని తెలిపారు. ఇలాంటి విషయాలను చెపితే తనను అర్బన్ నక్సలైట్, యాంటీ నేషనల్, పాకిస్థాన్ ఏజెంట్, యాంటీ హిందూ అనే ముద్ర వేస్తారని చెప్పారు.  2014 నాటి ఆర్థిక విధానాలను అవలంభిస్తే, కార్పొరేట్లను దూరం పెడితే…  ఇప్పటికీ లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ. 30 చొప్పున తగ్గించొచ్చని తెలిపారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com