నిన్న భారీ లాభాలను అందుకున్న మన స్టాక్ మార్కెట్లు నేడు కూడా అదే బాటలో కొనసాగాయి. మదుపరుల కొనుగోళ్ల సందడితో మార్కెట్లు జోష్ చూపించాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో షేర్లలో కొనుగోళ్లు బాగా జరగడంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో సెన్సెక్స్ 447 పాయింట్ల లాభంతో 50296 వద్ద.. నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 14919 వద్ద క్లోజ్ అయ్యాయి.
ఈ క్రమంలో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మైండ్ ట్రీ, టాటా మోటార్స్, ఎమ్ అండ్ ఎం, విప్రో, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ తదితర షేర్లు లాభాలను పొందాయి. ఇక ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, టాటా కెమికల్స్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా తదితర షేర్లు నష్టాలను చవిగొన్నాయి.
More Stories
స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు, 12వ తరగతి పరీక్షలు వాయిదా
మరో మారు దేశవ్యాప్త లాక్ డౌన్ పై నిర్మల సీతారామన్ తాజా వ్యాఖ్యలు!