22/04/2021

సీక్వెల్ షూటింగ్ మొదలెట్టిన వెంకటేశ్!

గతంలో వచ్చిన ‘దృశ్యం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఓ హత్య విషయంలో హీరో ఇంటిల్లిపాదీ ఒకే మాటపై నిలబడడం.. పోలీసులు ఎంతగా విచారణ చేసినా నిజం కక్కకపోవడం.. అదంతా ఓ కొత్త పంథాలో సాగుతూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

వెంకటేశ్, మీనా జంటగా నటించిన ఆ సినిమా మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ చిత్రానికి రీమేక్. ఇప్పుడు మలయాళంలో ‘దృశ్యం 2’ కూడా వచ్చింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ క్రమంలో వెంకటేశ్ ‘దృశ్యం 2’ని కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. గతంలో తెలుగులో ‘దృశ్యం’కు ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహిస్తే.. ఇప్పుడీ సీక్వెల్ కు మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగును ఈ రోజు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహిస్తామని నిర్మాతలు తెలిపారు. సురేశ్ ప్రొడక్షన్స్ దీనిని నిర్మిస్తోంది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: