07/05/2021

నందిని టెన్త్ చదివి నెలకు రెండు లక్షలు సంపాదిస్తోంది.. ఈమె స్టోరీ తెలిస్తే ఫిదా అవడం పక్కా..!

ఈ రోజుల్లో చ‌దువుకు త‌గ్గ జాబ్ లభించ‌డం లేదు. డిగ్రీలు, పీజీలు చేసిన వారికే వారి చ‌దువుకు త‌గ్గ జాబ్ లభించ‌డం లేదు. దీంతో ఖాళీగా ఉండ‌లేక ఏదో ఒక జాబ్‌తో నెట్టుకొస్తున్నారు. అలాంటిది కేవ‌లం 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మాత్ర‌మే చ‌దివిన వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. అయితే అలాంటి స్థితిలో ఉన్న మిగిలిన వారి సంగ‌తేమోగానీ నందిని ప‌రిస్థితి మాత్రం అలా కాదు. వేరేగా ఉంది. ఎవ‌రూ ఊహించ‌ని ఉన్న‌త స్థాయిలో ఆమె ఉంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రు..? ఎలా ఆ స్థానానికి చేరుకుందంటే…

ఆమె పేరు నందిని. వ‌య‌స్సు 33 సంవ‌త్స‌రాలు. కర్ణాట‌క రాష్ట్రంలోని బెంగుళూరు న‌గ‌రానికి స‌మీపంలో ఓ చిన్న గ్రామానికి చెందిన ఆమె తండ్రి పూజారి. దేవాల‌యంలో ప‌నిచేసేవాడు. అయితే చిన్న‌ప్ప‌టి నుంచి నందినికి డాక్ట‌ర్ కావాల‌నే కోరిక బ‌లంగా ఉండేది. కానీ కుటుంబ ప‌రిస్థితులు అంతంత మాత్రంగానే ఉండ‌డంతో ఆమె 10వ తర‌గతి వర‌కు మాత్ర‌మే చ‌దువుకుంది. ఈ క్ర‌మంలో వ‌య‌స్సు రాగానే ఆమెకు పెళ్లి చేశారు. ఆమె భ‌ర్త పేరు శ్రీ‌కాంత శాస్త్రి. అత‌ను కూడా పూజారే. అయితే తండ్రి చ‌నిపోవ‌డంతో నందినిపై చెల్లెలి పెళ్లి భారం ప‌డింది. దీంతో ఆమెకు క‌ష్టాలు ఎదుర‌య్యాయి. భ‌ర్త సంపాద‌న‌తో పాటు తాను కూడా చిన్న చిన్న ప‌నులు చేసి సంపాదించేది. అయితే అది ఏ మూలకూ స‌రిపోయేది కాదు. ఈ క్ర‌మంలోనే ఆమె బంధువుల్లో ద‌గ్గ‌రి వారైన కొంద‌రు ఊబ‌ర్ సంస్థ గురించి చెప్పారు. అందులో క్యాబ్ న‌డిపిస్తే దాని వ‌ల్ల లాభం ఉంటుంద‌నే స‌రికి ఆమె, ఆమె భ‌ర్త క‌లిసి త‌మ వ‌ద్ద ఉన్న న‌గ‌లు తాక‌ట్టు పెట్టి ట‌యోటా కారు కొని ఊబ‌ర్‌లో తిప్ప‌డం స్టార్ట్ చేశారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: