దేశంలో మూడు రోజుల పాటు పెరగకుండా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు మళ్లీ పెరిగాయి. చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచాయి. ఈ నెలలో 16వ సారి వాటి ధరలు పెరగడం గమనార్హం. పెంచిన ధరల నేపథ్యంలో… ఈ రోజు ఢిల్లీలో పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.91.17గా, డీజిల్ ధర రూ.81.47గా ఉంది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు పెరగడంతో దాని ధర రూ.94.79కి చేరింది. డీజిల్‌పై లీటరుకు 17 పైసలు పెంచడంతో రూ.88.86కి ఎగబాకింది. విజయవాడలో లీటరు పెట్రోలు ధర రూ.97.68గా ఉండగా, డీజిల్ ధర రూ.91.18కి పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర రూ.97.57, డీజిల్ రూ.88.70గా ఉంది.
More Stories
స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు, 12వ తరగతి పరీక్షలు వాయిదా
మరో మారు దేశవ్యాప్త లాక్ డౌన్ పై నిర్మల సీతారామన్ తాజా వ్యాఖ్యలు!