22/04/2021

హైద‌రాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ చేసి బీభ‌త్సం సృష్టించిన యువ‌కుడు.. ఒక‌రి మృతి

హైదరాబాద్ లోని వ‌న‌స్థ‌లిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువ‌కుడు డ్రంకెన్ డ్రైవ్ చేసి క‌ల‌క‌లం రేపాడు. హస్తినాపురంలో ఈ రోజు తెల్ల‌వారుజామున కారు న‌డుపుతూ వ‌చ్చిన గౌత‌మ్ అనే యువ‌కుడు మొద‌ట‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఆ వాహ‌నం డివైడర్ పైకి ఎక్కి మరో పక్కకి వెళ్లింది. ఆ స‌మ‌యంలో కారులో ఉన్న గౌత‌మ్ స్నేహితుడు సందీప్ ప్రాణాలు కోల్పోయాడు.

ఆ స‌మ‌యంలో రోడ్డుపై ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.  కారులో మొత్తం ముగ్గురు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఓ యువ‌కుడు పారిపోగా.. కారు న‌డిపిన గౌత‌మ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కారులో ఆ ముగ్గురు సాగర్‌ రోడ్‌ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్నార‌ని చెప్పారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌నపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: