17/04/2021

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

*  సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించే ‘శాకుంతలం’ చిత్రం తొలి షెడ్యూలు షూటింగును మార్చ్ 15 నుంచి హైదరాబాదులో నిర్వహిస్తారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఓ భారీ సెట్లో ఈ షూటింగ్ చేస్తారు. ఈషా రెబ్బా, మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ నిన్ననే ముగిసింది. హైదరాబాదులో నిర్వహించిన ఈ భారీ షెడ్యూలులో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఐశ్వర్యారాయ్, విక్రమ్, త్రిష, నయనతార, కీర్తి సురేశ్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
*  ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన ‘క్లైమాక్స్’ చిత్రం సెన్సార్ పూర్తయింది. భవానీ శంకర్ కె. దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చ్ 5న రిలీజ్ చేస్తున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: