07/05/2021

యువకుడి మృతి కేసులో కోడి అరెస్ట్.. ఏ1 ముద్దాయిగా కోడి!

వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, పందెం కోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని సతీశ్ అనే యువకుడు మృతి చెందాడు. కోడిని పందెంలోకి దింపే సమయంలో ఈ ఘటన జరిగింది.

కత్తి కట్టిన కాలుని కాకుండా మరోకాలుని సతీశ్ పట్టుకున్నాడు. అయితే కోడి తప్పించుకునే ప్రయత్నం చేయగా… దానికి కట్టిన కత్తి సతీశ్ పొట్టలో గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడ్డ సతీశ్ ని ఆసుపత్రికి తరలిస్తుండగా… మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సతీశ్ మరణానికి కారణమైన కోడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. లాకప్ లో దాన్ని కట్టేశారు. కేసులో ఏ1గా కోడిని చేర్చారు. మరోవైపు ఆ కోడిని పోలీసులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. దానికి తిండి, నీరు అందిస్తున్నారు. అప్పుడప్పుడు దాన్ని స్టేషన్ ప్రాంగంణలో ఉన్న చెట్టుకు కూడా కట్టేస్తున్నారు. మరోవైపు కోడి కూతలతో స్టేషన్ హోరెత్తిపోతోంది. కోడి పందేలను నిర్వహించినవారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: