14/05/2021

ప్రముఖ రచయిత వెల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

రచనా రంగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు విశిష్ట గుర్తింపు ఉంది. తాజాగా ప్రముఖ రచయిత వెల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించారు. నారాయణరావు సాహితీ సేవలకు గుర్తింపుగా ఈ ఉన్నత పురస్కారానికి ఎంపిక చేశారు. నారాయణరావు పరిశోధకుడిగానూ, అనువాదకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో సుదీర్ఘకాలం తెలుగు ఆచార్యుడిగా పనిచేశారు.

శ్రీకాళహస్తీశ్వర శతకం, బసవపురాణం, క్రీడాభిరామం, కళాపూర్ణోదయం, కాళిదాసు విక్రమోర్వశీయం  వంటి రచనలను, అన్నమయ్య, క్షేత్రయ్య వంటి వాగ్గేయకారుల సాహిత్యాన్ని ఆయన అనువదించారు. ప్రసిద్ధ తెలుగు కావ్యాలను ఆయన ఆంగ్లంలోకి తర్జుమా చేశారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: