మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నటిస్తోన్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాకు ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిట్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. యమ ధర్మరాజు లుక్లో ఆయన కనపడుతుండడం ఆకర్షిస్తోంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నిహారిక మహారాణిలా కనపడుతోంది. ఈ సినిమాను వచ్చే నెల 19న విడుదల చేయనున్నట్లు ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన విజయ్ సేతుపతి ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’తో మరోసారి అలరించడానికి సిద్ధమయ్యాడు. గత ఏడాది చైతన్య జొన్నలగడ్డను నిహారిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత విడుదలవుతున్న ఆమె తొలి సినిమా ఇదే.
More Stories
మహమ్మారి సమయంలో ఆపద్బాంధవుడిగా నిలిచిన సోనూసూద్ కు కరోనా పాజిటివ్!
కరోనాతో టాలీవుడ్ సీనియర్ కోడైరెక్టర్ సత్యం మృతి.. ప్రముఖుల సంతాపం
ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు వివేక్ కన్నుమూత.. శోకసంద్రంలో కోలీవుడ్