17/04/2021

హీరో హృతిక్ రోష‌న్‌కు ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసుల స‌మ‌న్లు

బాలీవుడ్ హీరో, హీరోయిన్లు హృతిక్ రోష‌న్, కంగ‌న ర‌నౌత్ మ‌ధ్య వివాదం ఉన్న విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ప్రేమ‌లో మునిగితేలిన ఈ జంట బ్రేక‌ప్ త‌ర్వాత ప‌ర‌స్ప‌రం నోటీసులు పంపుకోవ‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో 2016లో కంగ‌న ర‌నౌత్‌పై సైబ‌ర్ పోలీసుల‌కు హృతిక్ రోష‌న్ ఫిర్యాదు చేశారు. న‌కిలీ మెయిల్ ఖాతా నుంచి త‌న‌కు మెసేజ్‌లు, మెయిల్స్ వ‌స్తున్న‌ట్లు చెప్పారు. ఈ కేసును రెండు నెల‌ల క్రితం క్రైమ్ బ్రాంచ్‌కు సైబ‌ర్ పోలీసులు బ‌దిలీ చేశారు.

దీంతో దీనిపై విచార‌ణ జ‌రుపుతోన్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హీరో హృతిక్ రోష‌న్‌కు స‌మ‌న్లు పంపి, విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించారు. కంగ‌నా ర‌నౌత్ ఈ-మెయిల్ కేసులో భాగంగా రేపు విచార‌ణ‌కు వ‌చ్చి, ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని ఆదేశించారు. ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హృతిక్ వాంగ్మూలం న‌మోదు చేయ‌నున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: