17/04/2021

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

*  నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ‘రంగ్ దే’ సినిమా చివరి పాట చిత్రీకరణ నిన్నటితో ముగిసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
*  మలయాళంలో హిట్టయిన ‘దృశ్యం 2’ చిత్రాన్ని తెలుగులో జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే సురేశ్ ప్రొడక్షన్స్ రీమేక్ చేస్తోంది. వెంకటేశ్, మీనా జంటగా నటించే ఈ చిత్రం షూటింగును మార్చ్ 8 నుంచి హైదరాబాదులో నిర్వహిస్తారు. ఇతర కీలక పాత్రలలో నరేశ్, నదియా తదితరులు నటిస్తారు.
*  ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడుగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తాడు. నదియా కీలక పాత్ర పోషించే ఈ చిత్రం షూటింగును మే నెల నుంచి నిర్వహిస్తారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: