22/04/2021

మ‌రో షాక్.. వంట‌ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.25 పెంపు

ఓ వైపు పెట్రోలు, డీజిల్‌ ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో ఇబ్బందులు ప‌డుతోన్న సామాన్యుడికి వంట‌గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల పెరుగుద‌ల షాక్ ఇస్తోంది. ఒకే నెల‌లో మూడు సార్లు వంట‌గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరిగాయి. ఈ రోజు వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌పై మ‌రో రూ.25 పెంచుతున్న‌ట్లు చ‌మురు సంస్థ‌లు ప్ర‌క‌టించాయి.

పెరిగిన ధ‌ర‌లు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపాయి. ఈ నెల‌ 4వ తేదీన సిలిండ‌ర్‌పై రూ.25 పెరిగిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత 15వ తేదీన మ‌రో రూ.50 పెరిగింది. మూడుసార్లు గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లను పెంచడంలో ఈ నెల‌లో మొత్తం రూ.100 పెరిగిన‌ట్ల‌యింది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: