08/05/2021

న‌ల్ల రంగు చ‌ర్మం, మాసిన గ‌డ్డంతో క‌న‌ప‌డ‌డానికి ప్ర‌తిరోజు 2 గంట‌ల పాటు అల్లు అర్జున్‌కు మేక‌ప్‌!

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న‌ ‘పుష్ప’ సినిమా కోసం అభిమానులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు ఈ సినిమాపై ఆస‌క్తిని పెంచేశాయి.  ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌గా, లారీ క్లీన‌ర్‌గా క‌న‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే.

ఆ పోస్ట‌ర్ల‌లో ఆయ‌న కాస్త న‌ల్ల‌గా, మాసిన గ‌డ్డం, ఉంగ‌రాల జుట్టుతో ఉన్నాడు. ఆయ‌న స్మ‌గ్ల‌ర్ లుక్‌లో క‌న‌ప‌డ‌డానికి బాగా శ్ర‌మించాడు.  సాధార‌ణంగా బ‌య‌ట కూడా చాలా స్టైలిష్ గా క‌న‌ప‌డే బ‌న్నీ ఈ సినిమాలో మాత్రం న‌ల్ల‌గా క‌న‌ప‌డాల్సి ఉండ‌డంతో  షూటింగ్‌ ఉన్న ప్రతిరోజు రెండు గంటల స‌మ‌యం ఆయ‌న‌ మేకప్ కోస‌మే స‌రిపోతుంద‌ట‌.

బ‌న్నీ కనుబొమ్మల నుంచి జుట్టు, మీసాలు, చర్మం రంగు వంటి అన్ని అంశాల‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మేకప్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయ‌న  లుంగీ, షార్ట్స్ వేసుకుని క‌న‌ప‌డ‌నున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తమిళనాడులోని తెన్‌కాశీలో కొన‌సాగుతోంది. అక్క‌డ‌ యాక్షన్‌ సీక్వెన్స్ తో పాటు ఓ పాటను  చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు 13న ‘పుష్ప’ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ఆ సినిమా బృందం తెలిపింది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: