ప్రియుడితో క‌లిసి మ్యూజిక్‌ వీడియోను రూపొందిస్తోన్న హీరోయిన్ శ్రుతి హాస‌న్.. ఫొటోలు వైర‌ల్

ప్రియుడితో క‌లిసి మ్యూజిక్‌ వీడియోను రూపొందిస్తోన్న హీరోయిన్ శ్రుతి హాస‌న్.. ఫొటోలు వైర‌ల్

రెండేళ్ల విరామం తర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాస‌న్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘సలార్‌’ సినిమాలో నటిస్తోన్న విష‌యం తెలిసిందే. తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీలోనూ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో  ప్రేమలో ప‌డింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వారిద్ద‌రు ప‌లు చోట్ల జంట‌గా క‌న‌ప‌డుతున్నారు. శ్రుతి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శాంతను పెట్టిన పోస్టులు కూడా ఇందుకు బ‌లాన్నిస్తున్నాయి.

మరోపక్క, మ్యూజిక్‌ కంపోజింగ్ మీద‌ శ్రుతి హాస‌న్‌కు మొదటినుంచీ ఆస‌క్తి బాగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆమె శాంత‌నుతో క‌లిసి ఓ మ్యూజిక్‌ వీడియో చేయడానికి సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. శ్రుతి చేస్తున్న మ్యూజిక్‌ వీడియోలో శాంతను ర్యాప్‌ పాడనున్నాడు. గ‌తంలోనూ ర్యాపర్‌గా ఆయ‌న‌ కొన్ని పాటలు పాడాడు. తాజాగా, రికార్డింగ్‌ స్టూడియోలో ఈ మ్యూజిక్‌ వీడియోను రూపొందిస్తూ శాంతనుతో చిన్న వీడియోను, ఫొటోల‌ను తీసుకుని శ్రుతి ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది.

Leave a Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: