07/05/2021

ఏనుగును హింసిస్తున్న వీడియో వైరల్… సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ ఆలయంలో జయమాల్యత అనే ఏనుగు సేవలందిస్తోంది. ఇది 19 ఏళ్ల వయసున్న ఆడ ఏనుగు. అయితే ఈ ఏనుగు చెప్పిన మాట వినడంలేదంటూ మావటీలు శివప్రసాద్, వినీల్ కుమార్ దాన్ని తీవ్రంగా హింసిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏనుగును ఓ చెట్టుకు కట్టేసి దాన్ని విచక్షణ రహితంగా కొడుతున్న దృశ్యాలను నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. అంతటి ఏనుగు సైతం ఆ దెబ్బలకు తట్టుకోలేక మూగగా భరించిన వైనం ఆ వీడియో చూసిన వాళ్లను కలచివేసింది.

దీనిపై జంతు ప్రేమికులు ఎలుగెత్తిన నేపథ్యంలో హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ విభాగం అధికారులు స్పందించారు. ఆ వీడియోను తాము కూడా చూశామని, ఏనుగుపై దాష్టీకం చేసిన మావటీలపై చర్యలు తీసుకునే అంశం పరిశీలనలో ఉందని అధికారులు వెల్లడించారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: