‘సీటీమార్’ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌!

‘సీటీమార్’ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌!

‘క‌బ‌డ్డీ.. మైదానంలో ఆడితే ఆట‌.. బ‌య‌ట ఆడితే వేట’ అంటున్నాడు యాక్షన్ హీరో గోపీచంద్. ఆయ‌న‌ న‌టిస్తోన్న కొత్త సినిమా ‘సీటీమార్’ టీజ‌ర్‌ను ఈ రోజు ఆ సినిమా యూనిట్ ఈ రోజు విడుద‌ల చేసింది.

ఆయ‌న చేస్తోన్న ఫైటింగులు ప్రేక్ష‌కుల‌తో ‘సీటీమార్’ అనిపించేలా ఉన్నాయి. గోపీచంద్ ఈల వేయ‌డంతో ఈ టీజ‌ర్ ముగుస్తుంది. క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను మాస్ డైరెక్టర్ సంపత్ నంది రూపొందిస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇందులో త‌మ‌న్నా, దిగంగన సూర్యవంశి, భూమిక, రావు రమేశ్ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇందులో ఐటెంసాంగ్ లో అప్స‌ర రాణి క‌న‌ప‌డ‌నుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Leave a Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: