17/04/2021

హీరోయిన్ ఫొటోకు ‘హాట్’ అంటూ ఎమోజీ పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరో

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆమె ఫొటోకు హాట్ అంటూ ఎమోజీలు పోస్ట్ చేశాడు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్‌ ష్రాఫ్. ఆయ‌న చేసిన కామెంట్ నెటిజ‌న్లను ఆక‌ర్షిస్తోంది. దిశాతో ఆయ‌న డేటింగ్‌ చేస్తున్నాడ‌ని గత కొంతకాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వారిద్ద‌రూ చాలా పార్టీల్లో జంట‌గా క‌న‌ప‌డ్డారు. ఆనేక సార్లు మీడియా కంట ప‌డ్డారు. గ‌తంలో వారిద్ద‌రు కలిసి జంటగా మాల్దీవులకు కూడా  వెళ్లి వ‌చ్చారు.

వారిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారని బాలీవుడ్ లో ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో దిశా ప‌టానీ ఫొటోకు ఆయ‌న హాట్ ఎమెజీలు పోస్ట్ చేశాడు. తన ఫ్రెండ్‌ పెళ్లికి హాజరైన ఫొటోను దిశా ప‌టానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా ఇటువంటి కామెంట్ చేశాడు. ఇటీవ‌లే దిశా పటానీ టైగర్‌ ష్రాఫ్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పింది. ఆయ‌న ప‌ట్ల త‌న‌కు ఆరాధనా భావం ఉందని, ఆయ‌న త‌న‌ బెస్ట్‌ ఫ్రెండ్ అని తెలిపింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో కాకుండా వేరే స్నేహితులెవరూ లేరని చెప్పింది. ప్ర‌స్తుతం వారిద్ద‌రూ వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: