ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా క్రిస్ మోరిస్

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా క్రిస్ మోరిస్

ఐపీఎల్ చరిత్రలోనే ఒక సంచలనం నమోదైంది. ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. క్రిస్ ను రాజస్థాన్ రాయల్స్ రూ. 16.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడు ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి. రూ. 75 లక్షల బేస్ ప్రైస్ తో క్రిస్ వేలంపాటలోకి వచ్చాడు. అయితే అతన్ని సొంతం చేసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడటంతో… చివరకు కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాడు.

క్రిస్ మోరిస్ కంటే ముందు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ఐపీఎల్ 2020లో కమిన్స్ రూ. 15.5 కోట్ల ధర పలికాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మరియు లోయర్ ఆర్డర్ హిట్టర్ అయిన క్రిస్ మోరిస్ ఇప్పటి వరకు 70 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. 157.87 స్ట్రైక్ రేట్ తో 551 పరుగులు చేశాడు. 80 వికెట్లను పడగొట్టాడు.

Leave a Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: