17/04/2021

‘నాట్యం’ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్

కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు న‌టిస్తోన్న‌ తొలి సినిమా ‘నాట్యం’ టీజ‌ర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుద‌ల చేస్తూ, ఈ సినిమా బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపాడు. కథను మ‌నం వింటామ‌ని, అదే కథను కళ్లకు చూపిస్తే దాన్ని నాట్యం అంటామ‌ని ఇందులో విన‌ప‌డుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి.

నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడమ‌ని ఆదిత్య మేనన్ ఓ పాప‌కు చెబుతాడు. నువ్వు పాట‌లు కూడా పాడ‌తావా? అంటూ హీరోయిన్‌ను హీరో అడుగుతాడు. ఈ ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధానం చెప్ప‌కుండా కొబ్బ‌రికాయ ‌కొడుతుంది. చక్కని సంగీతాన్ని జోడిస్తూ ఈ టీజ‌ర్‌ను క‌ట్ చేశారు.

ఈ సినిమాకు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమా  ఫ‌స్ట్‌లుక్‌ను హీరో రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: