22/04/2021

విడాకులు ఇచ్చిన త‌ర్వాత స్వేచ్ఛ‌గా జీవిస్తున్నా: హీరోయిన్ శ్వేతా బ‌సు ప్ర‌సాద్

త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన త‌ర్వాత స్వేచ్ఛ‌గా జీవిస్తున్నాన‌ని హీరోయిన్ శ్వేతా బ‌సు ప్ర‌సాద్ తెలిపింది. ఆమె రోహిత్‌ మిట్టల్‌ అనే బాలీవుడ్‌ దర్శకుడిని పెళ్లి చేసుకుని, ఎనిమిది నెలల్లోనే విడాకులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె ఒంటరిగా ఉంటోంది. ఈ నేప‌థ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె  మాట్లాడుతూ.. త‌న‌ జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించాన‌ని చెప్పింది.

పెళ్లి తర్వాత కూడా స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయ‌ని, ఇప్పుడు మాత్రం స్వేచ్ఛగా జీవిస్తున్నానని  శ్వేతా బ‌సు ప్ర‌సాద్ తెలిపింది. తన వివాహ జీవితం  ఎనిమిది నెలల్లోనే ముగుస్తుందని తాను  ఊహించలేదని చెప్పింది. త‌న ప్రస్తుత జీవితం మాత్రం హ్యాపీగా ఉంద‌ని తెలిపింది.

కాగా, శ్వేతా బ‌సు ప్ర‌సాద్ బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  గ‌తంలో వ్యభిచార కేసులో పోలీసుల‌కు దొరికిపోయి అనంత‌రం జైలులో గ‌డిపింది. మ‌ళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్సును మొద‌లు పెట్టింది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: