గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం మీల్స్ రెడీ టు ఈట్‌ DFRL

గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం మీల్స్ రెడీ టు ఈట్‌ DFRL

భారత వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా ప్యాకింగ్ ఫుడ్‌ను తయారు చేసింది డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (DFRL). భారత దేశం త్వరలో చేపట్టునున్న గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం మీల్స్ రెడీ టు ఈట్‌ (MRE) ప్యాకింగ్ ఫుడ్‌ను సిద్ధం చేశారు.

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు.. అక్కడ ఏం తింటారని మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? వారి కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ఎక్కువ కాలం నిల్వ ఉంటూ, అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా భారత వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా ప్యాకింగ్ ఫుడ్‌ను తయారు చేసింది డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ ల్యాబొరేటరీ . ఈ సంస్థ మైసూర్ కేంద్రంగా పని చేస్తోంది. భారత దేశం త్వరలో చేపట్టునున్న గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం మీల్స్ రెడీ టు ఈట్‌ ప్యాకింగ్ ఫుడ్‌ను సిద్ధం చేశారు. ఆవకాయ పచ్చడి, చికెన్ కుర్మా, బిర్యానీ, మూంగ్‌దాల్ హల్వా.. వంటి 40 పదార్థాలను తయారు చేశామని ల్యాబ్‌లో పనిచేస్తున్న అధికారి ఒకరు తెలిపారు.

Image result for gaganyan project

వ్యోమగాముల కోసం ఇతర దేశాలు కూడా ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. కానీ మనవాళ్లు ఇలాంటి విదేశీ ఆహారాన్ని ఇష్టపడకపోవచ్చు. అందుకే ప్రత్యేకంగా వివిధ రకాల దేశీయ ఆహార పదార్థాలను తయారు చేశామని ల్యాబ్ అధికారులు వెల్లడించారు. ఒక్కో వంటకాన్ని నాలుగు లేయర్లు ఉండే ప్యాకింగ్ కంటెయినర్‌లో నిల్వ చేస్తున్నారు. ఈ ప్యాకెట్లు సైజులో చిన్నవిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కసారి ఓపెన్ చేస్తే అయిపోయేలా రూపొందిస్తున్నారు. వీటిని సిద్ధం చేసేందుకు ఒక సంవత్సరం పట్టిందని అధికారులు వివరించారు. ప్రస్తుతం అంతరిక్షంలోకి వీటిని వేడి చేసేందుకు హీటర్లను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇండియన్లు ఇతర దేశాలు తయారు చేసే వాటితో పోలిస్తే ఏమాత్రం తీసిపోవు. వీటిల్లో అన్ని రకాల పోషకాలు ఉండేలా పరిశోధకులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవి తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం వరకు పాడవ్వకుండా ఉంటాయి. వండాల్సిన అవసరం లేని పౌచ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. వీటి బరువు, పరిమాణం తక్కువగా ఉంటుంది. తినడానికి సులువుగా ఉండేలా వీటిని రూపొందించారు. పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటిని కూడా నాలుగు పొరలు ఉండే కంటెయినర్లలో నిల్వ చేశారు. వాటర్ బాటిళ్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా వీటిని తయారు చేశారు.

Leave a Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: