22/04/2021

చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను నేరుగానే ఎదుర్కొంటా: జో బైడెన్

చైనా నుంచి తన దేశానికి ఎదురయ్యే సవాళ్లను నేరుగానే ఎదుర్కొంటానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ లో యూఎస్ విదేశాంగ శాఖ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ప్రసంగించిన బైడెన్, చైనాను ఎదుర్కొనే విషయంలో ఏ విధమైన వెనుకడుగూ వేయబోనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా ప్రయోజనాలు దెబ్బతిననంతకాలం చైనాతో కలసి పని చేసేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.

“ఆర్థిక పరంగా ఎదురయ్యే సవాళ్లపై పోరాటం సాగిస్తాం. మా నుంచి వచ్చే ప్రతిస్పందన దూకుడుగా ఉంటుంది. మానవ హక్కుల ఉల్లంఘన, మేధో సంపత్తి మరియు ప్రపంచ పాలనపై చైనా దాడిని వెనక్కి నెట్టడానికి ఏ మాత్రం వెనుకంజ వేయబోము. ఇదే సమయంలో మరో విషయాన్ని కూడా స్పష్టం చేయాలని భావిస్తున్నా. బీజింగ్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధం. అది ఇరు దేశాలకూ లాభం కలిగేలా ఉండాలి. చైనాతో పాటు అన్ని దేశాలతో భాగస్వామ్యాలను పెంచుకుంటాం. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తాం” అని బైడెన్ వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, అంతకుముందు జాతీయ భద్రతా సలహాదారు జేకు సుల్లివన్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు యూఎస్ ప్రాధాన్యత చైనాలో తిరిగి గోల్డ్ మన్ సాక్స్ కు అనుమతులు పొందడంపై లేదని, తమ ప్రాధాన్యత అమెరికన్ల ఉద్యోగాలు, అమెరికా కార్మికులకు స్వదేశంలోనే కొల్లగొడుతున్న చైనా వాణిజ్య విధానాలపైనేనని అనడం గమనార్హం. అమెరికాను మరింత బలంగా నిలపడం ద్వారా పోటీ దేశాలు ముఖ్యంగా చైనాపై ఆర్థిక, ద్వైపాక్షిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ఆధిపత్యం సాగించవచ్చని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: