14/05/2021

బీట్‌రూట్‌ను అవైడ్ చేస్తున్నారా.. బీట్‌రూట్‌ ఆరోగ్యానికి మంచిది..

బీట్‌రూట్‌ ఆరోగ్యానికి మంచిదని మనలో చాలా మంది తింటుంటారు. ముఖ్యంగా, రక్త హీనత సమస్యతో బాధపడేవారు బాట్రూట్ తినడం వల్ల వారి శరీరంలో రక్తం బాగా వృద్ధి చెందుతుంది. బీట్‌రూట్ తినడం వల్ల వారి శరీరంలో రక్తం బాగా వృద్ధి చెందుతుంది. అలానే పచ్చి బీట్ రూట్, జ్యూస్ వల్ల అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి. అందువల్లే, క్రీడాకారులు ఎక్కువగా ఆట మధ్యలో బీట్ రూట్ జ్యూస్ను తాగుతుంటారు. ఇది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాక, దీనిలో ఐరన్ శాతం అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో రక్తం వృద్ధి చెంది, రక్తహీనత సమస్యని తగ్గిస్తుంది. బీట్ రూట్ తినడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.

బీట్‌రూట్స్‌లో బీటాలైన్స్ అని పిలువబడే ఫైటోన్యూట్రియెంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా, కడుపులోని దీర్ఘకాలిక మంట నివారించబడుతుంది. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్‌లో నొప్పి కూడా తగ్గుతుంది.

బీట్‌రూట్‌లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకం, ప్రేగు వ్యాధులు, డైవర్టికులిటిస్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, మిమ్మల్ని ఎక్కువ సేపు ఎనర్జీగా ఉంచుతుంది.

బీట్‌రూట్స్‌లో ఉండే నైట్రేట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాక, ఇది రక్త నాళాలను విడదీయడానికి, మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా మెదడు పనితీరును సులభతరం చేస్తుంది.

బీట్‌రూట్స్‌లో ఉండే డైటరీ నైట్రేట్‌ మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ రక్తపోటును తగ్గించడంలో, గుండెపోటు నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.

 బీట్రూట్లలో ఉండే విటమిన్ బి 6, సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన పోషకాల కోసం మీ రోజూవారి డైట్లో బీట్ రూట్స్ ఉండేలా చూసుకోవాలని డాక్టర్లు సలహాలిస్తున్నారు

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: