14/05/2021

ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి… ‘ఆచార్య’ టీజర్ వచ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ టీజర్ విడుదలైంది. ముందే చెప్పినట్టుగా ఈ సాయంత్రం 4.05 గంటలకు చిత్రబృందం టీజర్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. “ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి” అంటూ కొణిదెల ప్రొ కంపెనీ ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక.

“ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం… అలాంటి వాళ్ల జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు” అంటూ సాగే డైలాగుతో టీజర్ మొదలవుతుంది. అంతేకాదు, తనను ‘ఆచార్య’ అనడం వెనుకున్న కాన్సెప్ట్ ను కూడా చిరంజీవి వెల్లడించడం ఈ టీజర్ లో చూడొచ్చు. ఈ సినిమాను కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకాలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించాడు.

 

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: