హైదరాబాదులో ‘షీ పాహి’ కార్యక్రమంలో అనుష్క సందడి

హైదరాబాదులో ‘షీ పాహి’ కార్యక్రమంలో అనుష్క సందడి

హైదరాబాదు ఫిలిం నగర్ లో ‘షీ పాహి’ పేరిట పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అందాల నటి అనుష్క ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమంలో అనుష్క సైబరాబాద్ డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన పోలీసులకు పురస్కారాలు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ, ప్రతి మహిళా పోలీసు ఒక స్టార్ అని కొనియాడారు. కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న సమయంలో పోలీసులు ఎనలేని సేవలు అందించారని కితాబునిచ్చారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులు విధులు నిర్విర్తిస్తుండడం ఆనందదాయకం అని పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక హిత కార్యక్రమానికి తనను పిలవడం పట్ల అనుష్క సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి ‘షీ పాహి’ అని నామకరణం చేయడం సబబుగా ఉందని, సమాజంలో పరస్పరం అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Leave a Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: