అన్నా డీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి, జయలలిత నెచ్చెలి శశికళ (66) ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవించిన శశికళ ఈ మధ్యాహ్నం విడుదలయ్యారు. కాగా, శశికళ కొన్నిరోజులుగా బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రి నుంచి చిన్నమ్మ డిశ్చార్జికి మరో మూడ్రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. దీనిపై ఆసుపత్రి వర్గాలు స్పందించాయి.
శశికళను ఇవాళ డిశ్చార్జి చేయలేమని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా, అప్పుడప్పుడు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. అందుకే ఆమె మరో రెండు మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వివరించారు.
అక్రమాస్తుల కేసులో శశికళకు 2017లో నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు నిర్దేశించిన మేరకు రూ.10 కోట్ల జరిమానా చెల్లించడంతో ఆమె విడుదలకు మార్గం సుగమం అయింది. జరిమానా చెల్లించకపోతే శశికళ అదనంగా మరో ఏడాది జైల్లో ఉండాల్సి వచ్చేది.
More Stories
ముగిసిన కుంభమేళా… అధికారిక ప్రకటన!
ఛత్తీస్ గఢ్ లోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు కరోనా పేషెంట్లు ఆహుతి
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు… సీఐడీ విచారణకు ఆదేశిస్తా: మమతా బెనర్జీ