అణ్వస్త్రాన్ని మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి షహీన్-3ని పాకిస్థాన్ నిన్న విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) తెలిపింది. 2,750 కిలోమీటర్ల దూరంలో ఉపరితల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఇది సంప్రదాయ, అణువార్హెడ్లను మోసుకెళ్లగలదు. ప్రయోగం విజయవంతం కావడంపై పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ, ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్, సైనిక ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. షహీన్ క్షిపణిలోని డిజైన్, సాంకేతిక అంశాలపై పునస్సమీక్షలో భాగంగానే ఈ పరీక్ష నిర్వహించినట్టు పాక్ సైన్యం తెలిపింది.
