ఉద్యోగ, వ్యాపారాల రీత్యా విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తమ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరించుకునేందుకు పడుతున్న వెతలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దానిని మరింత సరళతరం చేసింది.
నిజానికి ఎన్నారైలు తమ డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణకు భారత ఎంబసీలనో, ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న పథకాల ద్వారానో లైసెన్స్‌ను పునరుద్ధరించుకునేవారు. అయితే, ఇక నుంచి మాత్రం ఆయా దేశాల నుంచే వాటిని పునరుద్ధరించుకోవచ్చని జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. దరఖాస్తు సందర్భంగా మెడికల్ సర్టిఫికెట్, వీసాను కూడా జత చేయాలని తెలిపింది.
More Stories
బ్రెజిల్లో కరోనా మృతులను ఖననం చేయడానికి స్థలం లేని వైనం.. శవపేటికలను ఉంచడానికి భవనాల నిర్మాణం
క్యూబాలో ముగుస్తున్న 6 దశాబ్దాల క్యాస్ట్రో శకం!
స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు