07/05/2021

యువ‌కుడితో కూతురు ప్రేమాయ‌ణం… ప్ర‌శ్నించినందుకు తండ్రికి నిప్పంటించి చంపిన‌ వైనం

కూతురు త‌మ గ్రామంలోని ఓ వ్య‌క్తితో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తోంద‌ని ఓ తండ్రి ఆవేశ‌పడ్డాడు. ఇటువంటి ప‌నులు చేసి, గ్రామాంలో త‌న‌కు త‌ల‌వొంపులు తీసుకురావ‌ద్ద‌ని చెప్పాడు. కుటుంబంలోని ఇత‌ర స‌భ్యులు మాత్రం ఆమెకు మ‌ద్ద‌తు తెలుపుతూ తండ్రిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‌లోని బోదాన్‌ జిల్లాలోని వాజిర్‌గంజ్‌ ఏరియా హత్రా గ్రామంలో చోటు చేసుకుంది.

ఆ ప్రాంతంలో నివ‌సించే ఆమిర్ అనే వ్య‌క్తికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉండ‌గా పెద్ద కూతురు ఓ యువ‌కుడితో ప్రేమలో మునిగితేలుతోంది. దీంతో కూతుర్ని తండ్రి నిలదీయడంతో కుటుంబంలో గొడ‌వ చెల‌రేగి కుటుంబసభ్యులకు ఆమిర్ కు నిప్పంటించారు. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వారు ఆయ‌న‌ను ఆసుప‌త్రిలో చేర్పించ‌గా, 30 శాతం కాలిన గాయాలతో ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. అయితే, అప్ప‌టికే కుటుంబ సభ్యులు పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: