22/04/2021

సిమ్లాలో న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకోవాలని..

చోరీ డ్రామా బెడిసి కొట్టి ఓ పాల వ్యాపారి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన న్యూఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సౌత్‌ ఈస్ట్‌ ఢిల్లీ సరితా విహారి ప్రాంతానికి చెందిన ఫైజ్‌ అహ్మద్‌ అనే పాల వ్యాపారి నూతన సంవత్సర వేడుకల్ని స్నేహితులతో సిమ్లాలో జరుపుకోవాలనుకున్నాడు. ఇందుకోసం చోరీ డ్రామా ఆడాలని నిశ్చయించుకున్నాడు. గురువారం పోలీసులకు ఫోన్‌ చేసి పాలను సప్లయ్‌ చేసే తమ వాహనంలోనుంచి 1.5 లక్షల రూపాయలను స్కూటీపై వచ్చిన వ్యక్తి దొంగలించుకెళ్లాడని చెప్పాడు.

అతడ్ని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులు అతడ్ని గట్టిగా విచారించగా చోరీ డ్రామాను బయటపెట్టాడు. తన స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ ‌వేడుకల్ని సిమ్లాలో జరుపుకోవాటానికి అబద్ధం చెప్పానని తెలిపాడు. ఈ డ్రామాలో అతడి మిత్రుడు షాదిక్‌ కూడా పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్దనుంచి మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: