న్యూక్లియర్ ఫ్యూజన్.. అణు కేంద్రకాలు ఒకదానిలో మరొకటి లీనమయ్యే ప్రక్రియ. దీని ద్వారా అనంతమైన శక్తి.. వేడి, వెలుతురు రూపంలో విడుదల అవుతాయి. సూర్యుడిలో జరిగేది ఇదే. అయితే..దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు భూమ్మీదే కేస్టార్(KSTAR) ఓ కృత్రిమ స్యూర్యుడిని సృష్టించారు. అందులో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిపి ఏకంగా 10 కోట్ల డిగ్రీల వేడిని పుట్టించారు. కృత్రిమ సూర్యుడు అనేది వాస్తవానికి ఓ యంత్రం. దీని ద్వారా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ఫ్యూజన్ జరిపి, ఏకంగా 20 సెకెన్లు పాటు 10 కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతను కొనసాగేలా చేశారు.
