ఎస్టీల రిజర్వేషన్ల శాతం పెంచిన తెలంగాణ సర్కారు!

Spread the love
  • ప్రస్తుతం తెలంగాణలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు
  • ఎస్టీల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన టీఆర్ఎస్ సర్కారు
  • అందుకనుగుణంగా సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సవరణ
  • రోస్టర్ పాయింట్లను కూడా ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ts government hike st reservations from 6 percent to 10 percent
తెలంగాణ సర్కారు బుధవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) కేటగిరీ కింద గిరిజనులకు కేటాయించిన రిజర్వేషన్ల శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం తెలంగాణలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమలు అవుతుండగా… తాజాగా దానిని రాష్ట్ర ప్రభుత్వం 10 శాతానికి పెంచింది. ఫలితంగా తెలంగాణలో భర్తీ అయ్యే ప్రతి పదో ఉద్యోగం ఎస్టీలకు దక్కనుంది.

ఎస్టీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం… అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరించింది. అంతేకాకుండా ఉద్యోగాల భర్తీకి సంబంధించి రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల్లో మరింత మేర గిరిజనులకు లబ్ధి చేకూరనుంది.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com