28/01/2021

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

1 min read

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు శుభవార్త! అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెల్లింపుల అంశంలో తెలంగాణ హైకోర్టు ఏపీ సర్కారుకు కీలక ఆదేశాలిచ్చింది. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వ్యక్తులకు చెల్లింపులు చేయొచ్చంటూ ఏపీ సర్కారుకు అనుమతి ఇచ్చింది. 2021 మార్చి నాటికి చెల్లింపులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కాగా, అగ్రిగోల్డ్ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగానే చెల్లింపులపై ఆదేశాలు ఇచ్చింది.

వాదనల సందర్భంగా ఏపీ సర్కారు తరఫు న్యాయవాది…. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల వివరాలను సీఐడీ సీఐ వార్డు సచివాలయాల ద్వారా సేకరిస్తారని హైకోర్టుకు తెలిపారు. సీఐ సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారని, డిపాజిటర్ల దరఖాస్తులను కలెక్టర్, జిల్యా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీఐడీ ఎస్పీ ధ్రువీకరిస్తారని వివరించారు.

12 thoughts on “అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెల్లింపులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

  1. Free movie download for linux at Movie Finder Pro. You can get Linux full movies download for free, download the HD movies now and enjoy. Sybila Pete Lavern

Leave a Reply

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!