14/05/2021

పిల్లల ఆరోగ్యానికి కొత్త ముప్పు.. పేరెంట్స్ జాగ్రత్త

కిడ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్స్  చిన్నపిల్లలే రకరకాల వస్తువులు, సైన్స్ ప్రయోగాలు, బొమ్మలు లాంటి విషయాల గురించి ఆన్ లైన్ లేదా యూట్యూబ్ లో అవగాహన కల్పిస్తున్నారు. అయితే వైజ్ఞానికంగా ఇవి మంచివే అయినప్పటికీ ప్రస్తుతం ఎక్కువ మంది జంక్ ఫుడ్స్ ను ప్రమోట్ చేస్తున్నారు.

కిడ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్స్.. వినేందుకు ఈ పేరు కొత్తగా ఉన్నా.. ఇప్పుడిప్పుడే వీటికి డిమాండ్ ఎక్కువగా ఏర్పడుతుంది. కిడ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్స్ చిన్నపిల్లలే రకరకాల వస్తువులు, సైన్స్ ప్రయోగాలు, బొమ్మలు లాంటి విషయాల గురించి ఆన్ లైన్ లేదా యూట్యూబ్ లో అవగాహన కల్పిస్తున్నారు. అయితే వైజ్ఞానికంగా ఇవి మంచివే అయినప్పటికీ ప్రస్తుతం ఎక్కువ మంది జంక్ ఫుడ్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఫలితంగా లక్షలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆ వీడియోలను చూడటం తప్ప వేరే మార్గం లేకపోయిందని తాజా సర్వేలో తేలింది.

కార్పొరేట్ కంపెనీలు రంగంలోకి..

నేటి తరం పిల్లల్లో ఎక్కువమంది యూట్యూబ్ ఛానెళ్లలో పాపులరవుతున్నారు. ఫలితంగా అనారోగ్యకరమైన ఆహారం, శీతలపానీయాలను వారి వీడియోల్లో ప్రమోట్ చేస్తున్నారని న్యూయార్క్ వర్సిటీ స్కూల్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు తెలిపారు. ఇప్పటికే చాలా మంది పిల్లలు ఏటా వేల రకాల ఫుడ్లను వాణిజ్య ప్రకటనలు వీక్షిస్తున్నారని, ఇప్పుడు అదనంగా యూట్యూబ్ వీడియోలు అగ్రస్థానంలో వెళ్తుండటంతో తల్లిదండ్రులు, పిల్లలు ఆరోగ్యకరమైన డైట్ ను పాటించడానికి మరింత కష్టతరమవుతుందని  ఎన్వైయూ స్కూల్ ఆఫ్ గ్లోబర్ పబ్లిక్ హెల్త్ నిపుణులు మ్యారీ బ్రాగ్ తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిజిటల్ మీడియా ఇలాంటి వాణిజ్య ప్రకటనలను ప్రోత్సహించకూడదని ఆమె అన్నారు.

ఆన్ లైన్ మార్కెటింగ్ ను పెంచుతున్నారు..
ఫుడ్ అండ్ బేవరేజ్ కంపెనీలు చిన్నపిల్లల ద్వారా తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ 1.8 బిలయన్ డాలర్లు(13 లక్షల కోట్లు) ఖర్చు చేశాయి. ఫుడ్ మార్కెటింగ్ లో టెలివిజన్ మేజర్ సోర్స్. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా వృద్ధి చెందుతోన్న నేపథ్యంలో కంపెనీలు ఆన్ లైన్ ప్రకటనలను పెంచుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించే సైట్లలో రెండోది యూట్యూబ్. అంతేకాకుండా పిల్లలకు వినోదాన్ని అందిస్తూ మంచి ప్రాచుర్యం పొందింది. 80 శాతం కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు 12 ఏళ్లకంటే తక్కువ వయసున్న తమ పిల్లలను యూట్యూబ్ చూసేందుకు అంగీకరిస్తున్నారు.

తమ పిల్లలు రెగ్యూలర్ యూట్యూబ్ చూస్తున్నారని 35 శాతం మంది తల్లిదండ్రులు నివేదిస్తున్నారు. 2020లో యూట్యూబ్ ఆకర్షణ బలంగా ఉంది. ఎందుకంటే కోవిడ్-19 కారణంగా తల్లిందండ్రులు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న కారణంగా పిల్లలను అదుపు చేయడం వారికి ఛాలెంజ్ గా అనిపించవచ్చుని సీనియర్ రచయిత బ్రాగ్ తెలిపారు. ఫుడ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ల వీడియోల్లో అనారోగ్యకరమైన ఆహారం, పానీయాలను ప్రోత్సహించడానికి పిల్లను ప్రభావితం చేస్తారనే విషయం తల్లిందండ్రులు గ్రహించలేరు.ఆరోగ్యానికి హానికలిగించే వీడియోలే ఎక్కువ..
బ్రాగ్, ఆమె సహచరులు 2019లో యూట్యూబ్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఐదుగురు కిడ్ ఇన్ ఫ్లూయెన్సర్లను గుర్తించారు. వీరి వయసు 3 నుంచి 14 ఏళ్ల వరకు ఉంటుంది. అంతేకాకుండా వారు ఎక్కువగా చూసిన వీడియోలను బ్రాగ్ బృందం విశ్లేషించింది. దాదాపు సగం వీడియోలు(42.8 శాతం) ఆహారం, పానీయాలను ప్రోత్సహించేవనని పరిశోధకులు కనుగొన్నారు. వీటిలో 90 శాతానికి పైగా జంక్ ఫుడ్స్, బ్రాండెడ్ ఫుడ్, పానీయాలు లేదా ఫాస్ట్ ఫుడ్ బొమ్మలు సంబంధించినవి ఉన్నాయి. జంక్ ఫుడ్ ప్లేస్ మెంట్ కలిగి ఉన్న వీడియోలను 1 బిలియన్ కంటే ఎక్కువ సార్లు చూశారు. ఇది ఆహార, పానీయాల కంపెనీలను బహిర్గత పరుస్తున్నాయి. ఎక్కువగా ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాలే ఎక్కువ ఉంటూ అపారమైన స్కీన్ సమయాన్ని కలిగిస్తున్నాయని బ్రాగ్ తెలిపారు. కిడ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ల జంక్ ఫుడ్ ప్రకటనలపై నిబంధనలు బలోపేతం చేయడం, వాటిని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి పరిశోధకులు నియంత్రకాలను ప్రోత్సహించారు.

Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Sorry You Cant copy this .. !!
%d bloggers like this: